దిశ కేసుల్లో బాధితులకు సమాజ తోడ్పాటునందిద్దామని విజయవాడలో పిలుపునిచ్చారు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్. ఇందుకు జిల్లావ్యాప్తంగా బృహత్తర సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండల కేంద్రం గుడ్లవల్లేరు జీఈసీ కళాశాలలో గుడివాడ, చల్లపల్లి సబ్ డివిజన్ల పరిధిలోని మహిళా పోలీసులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో కౌశల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 95 అంశాలతో కూడిన సర్వేపై మహిళా పోలీసులకు నిపుణులు, శిక్షణనిచ్చారు. దిశ బాధితుల్లో ఎక్కువమంది బలహీనవర్గాల వారే ఎక్కువగా ఉంటున్నారని కౌశల్ అన్నారు. అనంతరం గుడివాడ డీఎస్పీ సత్యానందం, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్లను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ ప్రోగ్రాం సమన్వయకర్త రాజీవ్ కుమార్, పామర్రు సీఐ వెంకటరమణ, గుడివాడ, చల్లపల్లి డివిజన్ల పరిధిలోని మహిళా పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Vinayaka Chavithi controversy: గవర్నర్కు భాజపా వినతి పత్రం..