కృష్ణా జిల్లాలోని నందివాడ మండలంలోని వెంకటరాఘవపుర అక్కినేని నాగేశ్వరరావు స్వస్థలం. అక్కడ రూ.13 లక్షలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. దీంట్లో ఎన్ఆర్ఇజిఎస్ పథకం కింద రూ.1,50,000 మంజురు చేశారు. మిగతా నిధులు అక్కినేని ఫౌండేషన్ సమకూర్చింది. ఈ భవనాన్ని మంత్రి పేర్ని నాని, ఎంపీ బలసౌరీలతో కలిసి కొడాలి నాని ప్రారంభించారు.
రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయని.. బయటికి రావాలంటేనే భయమేస్తోందని ప్రజలు మంత్రులకు విన్నవించారు. నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని.. అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని మంత్రులు హామీఇచ్చారు.