కృష్ణా జిల్లా విజయవాడ గేట్‌వే హోటల్‌లో జియోస్పేషియల్ కార్వాన్ పేరిట నిర్వహించిన కార్యశాలలో రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భూములను సమగ్ర సర్వే చేయించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. 1983లో మునసబులు, కరణాల వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రద్దు చేయడానికి ముందు భూ రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండేదన్నారు. అనంతరం సరైన ప్రత్యామ్నాయం లేక ఇప్పటికీ భూవివాదాలు అపరిష్కృతంగా మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సీఎం ఆదేశాల మేరకు భూముల సమగ్ర సర్వే రాష్ట్రంలోనే జరగబోతుందన్నారు. వ్యవసాయ రంగానికి ఈ సర్వే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 'యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం'