గ్రామ సచివాయాల్లోనే భూములు రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని త్వరలో ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నట్లు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. తొలుత రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కో గ్రామ సచివాలయంలో ఈ విధానాన్ని అమలుపరిచి పరిశీలించనున్నట్లు తెలిపారు.
కృష్ణా జిల్లా కంకిపాడు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఆటో మ్యుటేషన్ విధానాన్ని పిల్లి సుభాష్ పరిశీలించారు. భావితరాల కోసం ఎలాంటి లోపాలు లేని రెవెన్యూ రికార్డులు తయారు చేయాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు భూములు ప్యూరిఫికేషన్, రీసర్వే విధానం పునఃప్రారంభించినట్లు తెలిపారు.
భూముల మార్పిడి విధానం కోసం అమలు చేస్తున్న ఆటో మ్యుటేషన్ విధానం సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. దీనివల్ల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల మధ్య సమన్వయం పెరిగి గంటల వ్యవధిలోనే భూ మార్పిడి చేసే అవకాశం వచ్చిందన్నారు.
ఇదీ చూడండి: