ETV Bharat / state

చంద్రబాబుపై లక్ష్మిపార్వతి పిటిషన్​ కొట్టేసిన అనిశా కోర్టు - ACB case on chandrababu was dismissed latest News

తెదేపా అధినేత చంద్రబాబుపై 2005లో.. లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్​ను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణకు ఆదేశించాలని 2005లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన లక్ష్మీ పార్వతి పలు ఆరోపణలు చేశారు. వాటికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ న్యాయస్థానం పిటిషన్​ను కొట్టేసింది.

చంద్రబాబుపై లక్ష్మిపార్వతి పిటిషన్​ కొట్టేసిన అనిశా కోర్టు

author img

By

Published : May 3, 2021, 9:22 PM IST

Updated : May 3, 2021, 10:31 PM IST

తెదేపా అధినేత చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్​ను హైదరాబాద్​లోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. లక్ష్మిపార్వతి చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని నిర్థారించిన కోర్టు తుది తీర్పు ప్రకటించింది.

2005లో పిటిషన్ దాఖలు..

ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాస్తులు సంపాదించుకున్నారని లక్ష్మిపార్వతి 2005లో అనిశా కోర్టులో పిటిషన్ వేశారు. ఉమ్మడి హైకోర్టు స్టే విధించడంతో చాలా కాలం విచారణ ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవలే స్టే తొలగిపోవడంతో అనిశా న్యాయస్థానం విచారణ చేపట్టింది.

'అర్హత లేదు'

లక్ష్మి పార్వతికి ఈ అంశంపై పిటిషన్ వేసే అర్హత లేదని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు అభ్యర్థనను కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 18,972 కరోనా కేసులు, 71 మరణాలు

Last Updated : May 3, 2021, 10:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.