కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో మోపిదేవి, నాగాయతిప్ప, కోసూరు వారిపాలెం గ్రామాల్లో వందల ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. లాక్‌డౌన్ వల్ల కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో బజ్జి మిర్చికి గిరాకీ పెరింగిందని ఈ ఏడాది ఆ రకం మిర్చిసాగుచేశారు. హోటళ్లు, రెస్టారెంట్లులు మూసివేయటం వల్ల బజ్జి మిర్చి కొనుగోళ్లు లేవని రైతులు వాపోతున్నారు. మోపిదేవి మండలం నుంచి రోజుకు 500 బస్తాల మిర్చి తమిళనాడు, హైదరాబాద్, చెన్నై, విజయవాడ మార్కెట్లకు ఎగుమతి అయ్యేది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట చేతికొచ్చినా... గిట్టుబాటు ధరలేదంటున్నారు రైతులు. చేసేదేంలేక మిర్చి తోటలను ట్రాక్టర్‌తో దున్నేస్తున్నామని రైతలు తెలిపారు. ఎకరాకి నలభై వేలకు పైగా నష్టంవస్తుందని కర్షకులు ఆవేదన చెందుతున్నారు.
కిలో మిర్చి రూ.3
కరోనా వల్ల ఎగుమతులు నిలిచిపోయాయని మిర్చి రైతులు చెబుతున్నారు. స్థానికంగా అమ్ముకోడానికి ప్రయత్నించినా కిలో మిర్చి రూ.3లకు అడుగుతున్నారని వాపోతున్నారు. పంట మొత్తం అమ్మినా మిర్చి కోసిన కూలీల ఖర్చులు రావడంలేదంటున్నారు.
అన్నదాత సుఖీభవ.. అక్కరకు రావట్లేదు
గతంలో మిర్చి ధరలు తగ్గిపోయినప్పుడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ద్వారా కొనుగోలుచేసేదని...ఈ ఏడాది ఆ పరిస్థితులు కనబడటంలేదని రైతులు చెబుతున్నారు. చేసేదేంలేక ఎండిపోయిన మిర్చి తోటలను దున్నేస్తున్నామని రైతులు అంటున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎలాంటి సాయం అందడంలేదని వాపోతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి... తీరా పంట చేతికొచ్చినా, గిట్టుబాటు ధరలేక, రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: