ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. తిరువూరు పట్టణ, మండల పరిధిలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. బస్తాకు 3 కిలోల తరుగుతో ధాన్యం తూకాలు వేస్తున్నారనే ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఇంఛార్జ్లు దళారులను ప్రోత్సాహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: