రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహమ్మారిని నియంత్రించడంలో ముందుండి పోరాడుతున్న పలువురు పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. కృష్ణా జిల్లాలో కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న పోలీసు సిబ్బందితో ఎస్పీ రవీంద్రనాథ్ జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌పై యుద్ధంలో వారందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపి.. త్వరగా కోలుకుని మళ్లీ విధులకు హాజరవ్వాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి...