ETV Bharat / state

'ఎన్నికల కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాం..' - నూజివీడు పోలీస్​ స్టేషన్​ను సందర్శించిన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఎన్నికలకు 48 గంటల ముందే లిక్కర్ షాపులు మూసివేయాలని అన్నారు.

SP Rabindranath Babu
ఎన్నికల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాము
author img

By

Published : Mar 8, 2021, 9:12 AM IST

మున్సిపల్​ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు.. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పారు. నూజివీడు విచ్చేసిన ఆయన పట్టణ పోలీసులతో చర్చించారు. ఎన్నికలకు 48 గంటల ముందే లిక్కర్ షాపులు మూసివేయాలన్నారు. 67 ప్రాంతాల్లో చెక్​పోస్ట్​లు ఏర్పాటు చేయటం ద్వారా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే అక్రమంగా తరలిస్తున్న 4500 మద్యం బాటిళ్లు, 3500 లీటర్ల నాటుసారా సీజ్ చేసినట్లు చెప్పారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నేతృత్వంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 12 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 75 మంది ఎస్ఐలు మొత్తం 1500 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల మరుసటి రోజే మహాశివరాత్రి కావడంతో భక్తుల రద్దీని నియంత్రించేందుకు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వెంకట్ నారాయణ, పట్టణ ఎస్సై గణేష్ కుమార్ లు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ.. ప్రకాశం బ్యారేజీపై రాజధాని మహిళా రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.