కృష్ణానది వరద ముంపునకు గురైన విజయవాడలోని రామలింగేశ్వర నగర్ ప్రాంతాన్ని... జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ పరిశీలించారు. వరద సమస్యల గురించి స్థానికులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి... సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మరో 24 గంటలు వరద కొనసాగుతుందని... లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిటైనింగ్ వాల్ లీకేజీ నీరు ఇళ్లల్లోకి రాకుండా... ఇసుక బస్తాలు వేయించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి... ప్రాజెక్టులకు భారీ వరద... జలవనరుల శాఖ అప్రమత్తం