ETV Bharat / state

'మాస్టారు కష్టాలు' కథనానికి స్పందన

ఈటీవీ భారత్​లో పబ్లిష్ అయిన మాస్టారు కష్టాలు కథనానికి స్పందన లభించింది. ప్రైవేటు బడిపంతులు కష్టాలపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పందించారు.

krishna district collector respond on private teacher problem

author img

By

Published : Aug 31, 2020, 10:30 PM IST

Updated : Aug 31, 2020, 11:16 PM IST

బీఆర్​టీఎస్ రోడ్డులో చెప్పులు అమ్ముతున్న ప్రైవేటు పాఠశాల మాస్టారు వద్దకు కలెక్టర్ ఇంతియాజ్ వెళ్లారు. కరోనాతో పాఠశాలలు తెరవకపోవడంతో ఉపాధి లేక కష్టాలు పడుతూ.. రోడ్డుపై చెప్పులమ్ముతున్న ఉపాధ్యాయుడిని స్వయంగా చూశారు. ప్రైవేటు పాఠశాలలో లెక్కల మాస్టారుగా పనిచేస్తున్న మాచవరానికి చెందిన వెంకటేశ్వరరావు ఆర్థిక కష్టాలు ఇంతియాజ్ తెలుసుకున్నారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రుణం ఇప్పించాలని కలెక్టర్​ను వెంకటేశ్వరరావు కోరారు. తగిన ధ్రువపత్రాలతో వచ్చి కలవాలని కలెక్టర్ ఇంతియాజ్ ఉపాధ్యాయుడికి సూచించారు. తనకు సహాయం అందిస్తున్నందుకు కలెక్టర్​కు మాస్టారు ధన్యవాదాలు తెలిపారు.

'మాస్టారు కష్టాలు' కథనానికి స్పందన

ఇదీ చదవండి: రేపు కడప జిల్లాకు ముఖ్యమంత్రి జగన్

Last Updated : Aug 31, 2020, 11:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.