ETV Bharat / state

'అన్నదాతలు ఆధైర్యపడొద్దు... పంట నష్టపరిహారం అందిస్తాం'

author img

By

Published : Dec 3, 2020, 9:07 PM IST

ప్రభుత్వాదేశానుసారం పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసుకుంటున్నామని... అన్నదాతలెవరూ ఆధైర్యపడొద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. నివర్ తుపాను ప్రభావంతో జిల్లాలో లక్షా ఎనిమిది వేల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు.

'అన్నదాతలు ఆధైర్యపడొద్దు...పంట నష్టపరిహారం అందిస్తాం'

నివర్ తుపాను కారణంగా కురిసిన వర్షాలకు కృష్ణా జిల్లాలో లక్షా ఎనిమిది వేల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. ఈసారి పంట దిగుబడి గణనీయంగా వస్తుందని అంచనా వేసిన తరుణంలో వర్షాలు దెబ్బతీశాయన్నారు. ప్రభుత్వాదేశానుసారం పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసుకుంటున్నామని... అన్నదాతలెవరూ ఆధైర్యపడొద్దని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులు తమ పేర్లను ఈ-క్రాప్​లో నమోదు చేసుకోనిపక్షంలో స్థానిక రైతు భరోసా కేంద్రానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

రంగుమారిన, మెులకెత్తిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సడలించామని తెలిపారు. ధాన్యం సేకరణకు జిల్లావ్యాప్తంగా 338 కొనుగోలు కేంద్రాలున్నాయని.. రైతులకు ఎలాంటి సమస్యలున్నా ప్రతిరోజు కలెక్టర్ నిర్వహించే ఫోన్​ఇన్ కార్యక్రమంలో పాల్గొని తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్​ఫ్రీ నెంబర్​ 1800425440 కు ఫోన్‌ చేసినా ఇబ్బందులు పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఇదీచదవండి

రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం ఇవ్వాలి: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.