ETV Bharat / state

జులై 1 నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు పునః ప్రారంభం

జులై 1 నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలను పునః ప్రారంభిస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మంగళవారం నుంచి ఇంటింటికి జ్వర సర్వే చేయిస్తున్నామని అన్నారు.

krishna district collector on corona cases regulations

author img

By

Published : Jun 22, 2021, 9:58 AM IST

జులై 1 నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలను పునః ప్రారంభిస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండ్, అధికారులతో ఈ అంశంపై చర్చించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 216 మంది బ్లాక్ ఫంగస్, 350 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు శస్త్రచికిత్స చేసేందుకు ఇప్పటికే రెండు ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అదనంగా మరో థియేటర్​ను సిద్ధం చేస్తున్నామన్నారు.

'ఇంటింటికి జ్వర సర్వే ఈ నెల 22 నుంచి చేయిస్తున్నాం. అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. మూడో దశ ఉంటే ఎలా ఎదుర్కోవాలి. ఏమేం కావాలనేదానిపై సమీక్ష చేస్తున్నాం. పిల్లల పడకలు, ఆక్సిజన్‌ సౌకర్యం, ఇతర మౌలిక వసతులు, మందులు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కేసులు తగ్గుముఖం పట్టాయని నిర్లక్ష్యం తగదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ విభాగాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి.'- కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్

ఇదీ చదవండి:

జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.