కరోనా రెండోదశ వ్యాప్తి నుంచి సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని జిల్లా కలెక్టర్ ఎ.ఎండీ ఇంతియాజ్ అన్నారు. ఈ మేరకు స్థానిస స్వచ్ఛంద సంస్థలతో ఆయన సమావేశం నిర్వహించారు. పంచసూత్రాల పేరిట రెడ్‌క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా విభాగం ప్రజలను చైతన్యపరుస్తుందని ఆయన కొనియాడారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ రెడ్‌క్రాస్ సొసైటీ రూపొందించిన గోడ ప్రతులను, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.
కంట్రోల్ రూం ద్వారా జిల్లాలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్ల వినియోగించడం తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మోహన్‌కుమార్, కృష్ణాజిల్లా శాఖ రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ డా. జి. సమరం, సెక్రటరీ డా. ఇళ్ల రవి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు విప్రో శానిటైజర్ కిట్లు..
మున్సిపల్, వైద్య సిబ్బందికి విప్రో సంస్థ తరఫున 1500 శానిటైజర్ కిట్లను కలెక్టర్‌కు ఆ సంస్థ ఏరియా మేనేజర్ బి. నరసింహులు అందజేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు చేయూతనిచ్చేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ పంపిణీ కార్యక్రమంలో డీఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, విప్రో ఏరియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: