స్థానిక ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఐ అండ్ పీఆర్ బృందాలతో కొవిడ్ వ్యాక్సినేషన్, రిపోర్ట్ సమర్పణ కమిటీలు సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. ఉన్నతాధికారులకు పంపవలసిన నివేదికలను ఎప్పటికప్పుడు నిర్దిష్ట సమయానికి అందించాలని ఎన్నికల అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఇదీ చదవండి: గ్రామ ప్రథమ పౌరుడు.. ప్రగతి రథచక్రాలను నడిపించే శక్తిమంతుడు