మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబ సభ్యులను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర దంపతులు, మాజీమంత్రి నెట్టెం రఘురాంలు పరామర్శించారు. పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రెండేళ్లుగా ప్రభుత్వ అవినీతి అక్రమాలను మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నిస్తున్నారని.. వాటిని భరించలేకే ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడ్డారని నేతలు మండిపడ్డారు. ప్రజలు దీనిని క్షమించరన్నారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలను, అక్రమాలను సంఘటితంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
సొంత నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు.. అదును చూసి ఆక్రమిస్తున్నారు!
Jagananna Vidya Deevena: 'జగనన్న విద్యా దీవెన'.. నేడే రెండో విడత నిధుల విడుదల