ETV Bharat / state

కవిత, షర్మిల మధ్య ట్వీట్ వార్ - కవిత షర్మిల ట్వీట్​ వార్​

Kavitha and Sharmila tweet war: తెలంగాణలోని టీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత, వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల... ట్వీట్‌ యుద్ధానికి దిగారు. పేర్లు ప్రస్తావించుకోకుండానే.. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. షర్మిల బీజేపీ వదిలిన బాణం అని అర్ధం వచ్చేలా కవిత ట్వీట్‌ చేశారు. ఆమె తానా అంటే.. బీజేపీ రాష్ట్ర నేతలు తందనా అంటున్నారని విమర్శించారు. కవిత ట్వీట్‌కు స్పందించిన షర్మిల ఘాటు విమర్శలు చేశారు. పదవులు పొందడమేగానీ పనితనం ఏమీ ఉండదని.. ప్రజా సమస్యల ఎన్నడూ పట్టించుకున్నది లేదని ఆరోపించారు.

Tweet war between Kavitha and Sharmila
కవిత షర్మిల మధ్య ట్వీట్ వార్
author img

By

Published : Nov 30, 2022, 7:46 PM IST

Kavitha and Sharmila tweet war: తెలంగాణలోని వరంగల్‌ పాదయాత్రలో జరిగిన ఘర్షణ, హైదరాబాద్‌లో షర్మిలను అరెస్ట్‌ చేయడం.. టీఆర్​ఎస్​, వైఎస్సార్​టీపీ మధ్య మాటలయుద్ధానికి దారితీశాయి. షర్మిల, టీఆర్​ఎస్​ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. షర్మిల అరెస్ట్‌పై బీజేపీ రాష్ట్ర నేతలు స్పందించడంపై టీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. నేరుగా బీజేపీ పేరు ప్రస్తావించ కుండానే.. ఆ పార్టీని ఉద్దేశించి పరోక్ష ఆరోపణలు చేశారు. తాము వదిలిన బాణం.. తానా అంటే తందనా అంటున్న తామరపువ్వులు' అంటూ కవిత ట్వీట్ చేశారు. షర్మిల అరెస్టు వ్యవహారంలో టీఆర్​ఎస్​ సర్కార్ వైఖరిని తప్పుపడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలనే ఉద్దేశించే.. కవిత నర్మగర్భంగా ట్వీట్ చేశారు.

  • తాము వదిలిన “బాణం”
    తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కవిత ట్వీట్‌కు స్పందించిన షర్మిల.. ఆమె పేరు ప్రస్తావించకుండానే బదులిచ్చారు. పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదని.. కవితను ఉద్దేశించి విమర్శించారు. ఇచ్చిన హామీల అమలు చేసిందని.. పదవులే తప్ప పనితనం లేదని దుయ్యబట్టారు. గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదని షర్మిల వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

  • పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు.

    — YS Sharmila (@realyssharmila) November 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

షర్మిల ట్వీట్‌పై కవిత.. కవితాత్మకంగా స్పందించారు. అమ్మా.. కమల బాణం.. ఇది మా తెలంగాణం అని వ్యాఖ్యానించారు. పాలేవో.. నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజాగణం తెలిపారు. మొన్నటిదాకా షర్మిలకు పులివెందులలో ఓటు ఉందని.. ఇప్పుడేమో తెలంగాణ రూటుకు వచ్చారని ఎద్దేవా చేశారు. కమలం కోవర్టు, ఆరేంజ్ ప్యారేట్టు అంటూ ఆరోపించారు. షర్మిల లాగా తాను పొలిటికల్ టూరిస్ట్ కాదని.. రాజ్యం వచ్చాకా రాజకీయాల్లోకి రాలేదని స్పష్టంచేశారు. గులాబీతోటలో కవితను కాదని.. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి " కవిత" తానని కవిత ఘాటుగా బదులిచ్చారు. కవిత, షర్మిల మధ్య సాగిన ట్వీట్‌-ఫైట్‌ రాజకీయంగా చర్చనీయాంశమైంది. టీఆర్​ఎస్​, వైఎస్సార్​టీపీ కార్యకర్తలు తమ అభిమాన నేతలకు మద్దతుగా ట్వీట్‌ వార్‌కు దిగారు.

  • అమ్మా.. కమల బాణం
    ఇది మా తెలంగాణం
    పాలేవో నీళ్ళేవో తెలిసిన
    చైతన్య ప్రజా గణం

    మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు
    నేడు తెలంగాణ రూటు
    మీరు కమలం కోవర్టు
    ఆరేంజ్ ప్యారేట్టు

    మీ లాగా
    పొలిటికల్ టూరిస్ట్ కాను నేను
    రాజ్యం వచ్చాకే రాలేదు నేను
    ఉద్యమంలో నుంచి పుట్టిన
    మట్టి " కవిత" ను నేను ! https://t.co/rkGthDtHF9

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.