దేశంలో కరోనానూ రాజకీయంగా వాడుకునే ఏకైన వ్యక్తి చంద్రబాబే అని మంత్రి కన్నబాబు విమర్శించారు. వలస కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తుంటే... మొత్తం తానే చేస్తున్నట్లు చంద్రబాబు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. అలాగే దేశం మొత్తం మద్యం విక్రయాలు జరుగుతుంటే... ఏపీలో ఏదో జరిగిపోతున్నట్లు విమర్శలు చేయడం శోచనీయన్నారు.
లాక్డౌన్ కారణంగా వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున అందుబాటులోకి రావాలని సూచించారు. ఆహారశుద్ధి పరిశ్రమల్లో నైపుణ్యం ఉన్న కార్మికులు అవసరం ఉందని వెల్లడించారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించుకోవడానికి సంబంధిత సంస్థలకు అనుమతులు ఇచ్చే అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆరెంజ్ జోన్‌లో రాత్రి 7 నుంచి ఉదయం 4 వరకు నిషేధం ఉందన్న కన్నబాబు.... ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించటంలో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో తగిన ఆదేశాలు ఇస్తామని చెప్పారు.
ఇదీ చదవండి