ETV Bharat / state

JP Company Not Paid Sand Arrears to APMDC: జేపీ సంస్థపై వైసీపీ సర్కారు ప్రేమ.. రూ.120 కోట్ల బకాయిపై నోరెత్తని వైనం - ఏపీ లేటెస్ట్ న్యూస్

JP Company Not Paid Sand Arrears to APMDC: రాష్ట్ర ప్రభుత్వం ఇసుక గుత్తేదారు సంస్థ అయిన జేపీ సంస్థపై ప్రత్యేక ప్రేమ చూపుతోంది. 14 లక్షల టన్నుల ఇసుకతోపాటు యంత్రాలు తీసుకున్న ఆ సంస్థ.. చెల్లించాల్సిన 120 కోట్ల రూపాయలను ఇప్పటి వరకూ ఇవ్వలేదు. రెండున్నరేళ్లయినా దోబూచులాడుతోంది. అయినా సరే.. ప్రభుత్వం, సంబంధిత శాఖ ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం.

JP_Company_Not_Paid_Sand_Arrears_to_APMDC

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 12:12 PM IST

Updated : Oct 25, 2023, 12:26 PM IST

JP Company Not Paid Sand Arrears to APMDC: కోట్ల రూపాయల బకాయిలపై రెండున్నరేళ్లైనా నోరెత్తని జేపీ సంస్థ.. ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం

JP Company Not Paid Sand Arrears to APMDC: రాష్ట్రంలో అన్ని నిల్వకేంద్రాల్లో ఉన్న ఇసుక తీసుకొని గుత్తేదారు జేపీ పవర్‌వెంచర్స్‌ అమ్మేసుకుంది. తూకపు యంత్రాలు తదితరాలను వినియోగించుకుంటోంది. కానీ వీటికి 120 కోట్ల రూపాయలు అడిగితే రెండున్నరేళ్లుగా నోరెత్తడంలేదు. ముక్కుపిండి బకాయి రాబట్టాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇసుక కాంట్రాక్టు నుంచి జేపీ సంస్థ త్వరలో వైదొలగనున్నట్లు తెలిసినా దాని జోలికి వెళ్లకుండా జగన్‌ ప్రభుత్వం ప్రత్యేకప్రేమ చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2021 మే నుంచి ఇసుక తవ్వకాలు, విక్రయాలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి జేపీ సంస్థ తీసుకుంది.

Sand Arrears: అదే సమయంలో అన్ని నిల్వ కేంద్రాల్లో ఉన్న 14 లక్షల టన్నుల ఇసుకను జేపీ సంస్థకు అప్పగించారు. నిల్వకేంద్రాలు, రీచ్‌ల వద్ద ఏపీఎండీసీ గతంలో కొన్న 117 తూకపు యంత్రాలు, 1,300 వరకు సీసీ కెమెరాలు, మొబైల్‌ డివైజ్‌లు, బయోమెట్రిక్‌ డివైజ్‌లు, ప్రింటర్లు కూడా జేపీ సంస్థకు ఏపీఎండీసీ అప్పగించింది. వీటన్నింటి విలువ కలిపి 100 కోట్లు, ఇప్పటివరకు వడ్డీ రూ.20 కోట్లు అయింది. ఇందులో నయాపైసా కూడా ఏపీఎండీసీకి జేపీ సంస్థ చెల్లించలేదు.

TDP Pattabhi on JP Power Ventures Sand Mining: ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిపి.. జీఎస్టీ ఎందుకు చెల్లించడం లేదు..?: పట్టాభి

Sand Mining:తొలుత జేపీ సంస్థ పేరిట ఇసుక విక్రయాలు ఆరంభమైన కొద్ది రోజులకే బకాయిలు ఇవ్వాలని ఏపీఎండీసీ కోరింది. నిల్వకేంద్రాల్లోని ఇసుక విక్రయించాక సొమ్ము చెల్లిస్తామని జేపీ సంస్థ మొదట్లో చెప్పింది. నెలలు, సంవత్సరాలు దాటిపోయాయి. ఇప్పటికి రెండున్నరేళ్లు అయినా ఆ సంస్థ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. బకాయిలు చెల్లించాలని ఏపీఎండీసీ ఇప్పటికే అనేక దఫాలు గనులశాఖకు, జేపీ సంస్థకు పదేపదే లేఖలు రాస్తోందే తప్ప, ఒత్తిడి మాత్రం తీసుకురావడంలేదు.

APMDC:ఏపీఎండీసీ నుంచి జేపీ సంస్థకు 14 లక్షల టన్నుల ఇసుక

JP Power Ventures Sand Mining: ఈ సొమ్ము విషయంలో జగన్‌ ప్రభుత్వం ఏమీ ఎరగనట్లు మౌనంగా వ్యవహరిస్తోంది. ఇసుక వ్యాపారమంతా పారదర్శకంగా జరుగుతోందని పదేపదే చెబుతున్న గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డి.. ఏపీఎండీసీకి నష్టం జరుగుతున్నా ఉలుకూపలుకూ లేకుండా ఉన్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం మూడు ప్యాకేజీలుగా మళ్లీ టెండర్లు పిలిచారు.

జేపీ పవర్‌తో 'ఇసుక' ఒప్పందం పూర్తి

JP Ventures: కొత్త గుత్తేదారు ఎంపికయ్యాక వచ్చే నెలలో దానికి ఇసుక వ్యాపారం అప్పగించనున్నారు. దీంతో జేపీ సంస్థ వైదొలగనుంది. తర్వాత దానినుంచి బకాయి ఎలా వసూలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జేపీ సంస్థ పేరిట అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలే ఇసుక వ్యాపారం చేస్తుండటం, పెద్దలకు అనధికారికంగా కప్పం కడుతుండటంతో, ఆ సంస్థ నుంచి బకాయిలు రాబట్టే విషయంలో మౌనంగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.

sand arrears: సర్కార్​ను వీడని ఇసుక కష్టాలు.. రూ.150 కోట్లు బాకీ పడ్డ జేపీ సంస్థ!

Last Updated : Oct 25, 2023, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.