కృష్ణాజిల్లా మైలవరంలో రెవెన్యూ, సచివాలయ, పంచాయతీ తదితర శాఖల అధికారులు, సిబ్బందితో జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన్ చందర్ సమావేశం నిర్వహించారు. పలు అంశాల్లో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ-క్రాప్ నమోదు విషయంలో మైలవరం మండలం అట్టడుగు స్థాయిలో ఉందని సంబంధిత శాఖల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట మార్పిడి నమోదు మూడు నెలలు పూర్తి అవుతున్నా జాప్యం జరగడంపై సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది కార్యాచరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు..పనులు వేగవంతం చేయాలని సూచించారు.
ఇదీ చూడండి. సీబీఐ విచారణకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించాలి