విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్న జనసేన నేతలు రాజధానిపై సీఎం జగన్.. తన మనసులో మాట చెప్పడానికి నిపుణుల కమిటీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎందుకుని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ నేతలు ప్రశ్నించారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాలు కలిగిన రాష్ట్రంలో 3 రాజధానులు ఏంటని నిలదీశారు. అసెంబ్లీలో.. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పడం, అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి.. మూడు రాజధానుల ఉండొచ్చని చెప్పడం సినిమా మలుపులను తలపిస్తోందన్నారు.
రాజధాని ఇక్కడా.. అక్కడా అని చెప్పి.. రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెట్టారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో తెదేపా నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న ముఖ్యమంత్రి... విశాఖలో వైకాపా నేతలు చేసిందేంటని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇప్పటి దాకా కూల్చివేతలకు ఇచ్చిన ప్రాధాన్యం.. నిర్మాణాలు చేపట్టడానికి ఇవ్వలేదన్నారు.
ఇదీ చదవండి:
'వైకాపా ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి'