సీఎం జగన్ విధానాలను సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించిన వారిని కక్షపూరితంగా అరెస్టులు చేయిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన నలందకిశోర్‌ను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఆయన ఫార్వర్డ్ చేసిన సందేశంలో ఎక్కడా వ్యక్తిగత దూషణలు లేవని... వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో అరెస్టైన కృష్ణారావునూ విడుదల చేయాలన్నారు. తమ పార్టీ నేతలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, పంచుమర్తి అనురాధ చేసిన ఫిర్యాదులను ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా అని నిలదీశారు. పోలీసులు వివక్ష ఎందుకు చూపుతున్నారన్న చంద్రబాబు.... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం రాష్ట్ర పోలీసుల తీరుపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు.
ఇదీ చదవండి
రాజకీయ పోస్టులు ఫార్వర్డ్.. ఇద్దరు తెదేపా సానుభూతిపరులు అరెస్టు