ETV Bharat / state

'ఇంద్రకీలాద్రికి సీఎంను ఆహ్వానించాం' - news updates in vijayawada

ఈనెల 17 నుంచి విజయవాడలో శరన్నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్​ను ఆహ్వానించినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేశారు.

Invitation to the Chief Minister to present silk garments to Sridurgamalleswaraswamy in vijayawada
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
author img

By

Published : Oct 8, 2020, 11:17 PM IST

విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా... పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్​ను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆహ్వానించారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ సురేష్‌, ఆలయ అర్చకులతో కలిసి సీఎంకు ఆహ్వాన పత్రికలు అందించినట్లు తెలిపారు.

కరోనా నుంచి కోలుకున్న అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు... దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈనెల 17 నుంచి 25 వరకు అమ్మవారికి 9 రోజుల్లో 10 అలంకారాలు చేస్తారని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గంటకు వెయ్యి మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:

ట్రంప్ X బైడెన్: రెండో డిబేట్ కోసం రూల్స్​ మార్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.