కొవిడ్ నేపథ్యంలో చేపడుతోన్న ‘వందే భారత్ మిషన్’లో భాగంగా జూన్ 2వ తేదీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విదేశీ సర్వీసులు(International flights) ప్రారంభంకానున్నాయి. ప్రవాసాంధ్రులు అధికంగా ఉండే కువైట్, మస్కట్, సింగపూర్‌ల నుంచి తొలుత ఈ సర్వీసులు ప్రారంభించనున్నారు. ఆదివారం మినహా ఇతర రోజుల్లో నిత్యం ఒకటి, రెండు సర్వీసులు రాష్ట్రానికి చేరనున్నాయి.
ఇప్పటివరకు దిల్లీ మీదుగా ఈ సర్వీసులు ఉండేవని.. ఇప్పుడు ఆయా దేశాల నుంచి నేరుగా ఇక్కడికి చేరుకోనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు తెలిపారు. విజయవాడ నుంచి కూడా నేరుగా ఆయా దేశాలకు ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జులై 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
ధ్రవపత్రం ఇవ్వండి: సీఎం జగన్
మరోవైపు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్ర సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల కోసం వీసాలపై విదేశాలకు వెళ్లేవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రభుత్వ ధ్రువపత్రం అందించాలని సూచించారు.
ఇదీ చదవండి: