ఇసుక అందుబాటులో లేని కారణంగా... కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, యువజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో భవన కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఇసుక కేజీ లెక్కన కొనాల్సి వస్తోందని యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నజీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిమెంట్ బస్తా ధర కన్నా, ఇసుక బస్తా ధర అధికంగా ఉందని, సామాన్యులు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇసుక కొరత కారణంగా ఉపాధి లేక రోడ్డున పడ్డామని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: