ETV Bharat / state

ఇండియన్ గ్యాస్ రీఫిల్ బుకింగ్​కు ఇప్పుడు దేశమంతా ఒకే నెంబర్ - Indian Oil Corporation latest news

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ వినియోగదారులు ఇకపై రీఫిల్ బుకింగ్​ను ఒకే నెంబర్ ద్వారా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఇది నవంబర్ 1వ తేదీనుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఫోన్ నెంబ‌రు 7718955555 ద్వారా 24 గంట‌లపాటు రీఫిల్‌ను బుకింగ్ చేసుకునే సౌల‌భ్యం వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటుంద‌ని తెలిపారు.

Indian Oil Corporation
Indian Oil Corporation
author img

By

Published : Oct 30, 2020, 7:43 PM IST

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ గ్యాస్‌ వినియోగదారులు.. రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు దేశ‌వ్యాప్తంగా న‌వంబ‌రు ఒకటో తేదీ నుంచి ఒకే నెంబరును ప్రారంభిస్తున్నట్లు ఐవోసీ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఎల్​పిఫుల్ జిలె తెలిపారు. ఇప్పటివ‌ర‌కు ప్రాంతాలవారీగా రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు వివిధ ఫోన్ నంబ‌ర్లు అందుబాటులో ఉండేవ‌ని అన్నారు. న‌వంబ‌రు 1వ తేదీ నుంచి ఒకే మొబైల్ నంబ‌రు ద్వారా దేశవ్యాప్తంగా రీఫిల్‌ను బుకింగ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

7718955555 ఫోన్ నెంబ‌రు ద్వారా 24 గంట‌లపాటు రీఫిల్‌ను బుకింగ్ చేసుకునే సౌల‌భ్యం వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటుంద‌ని తెలిపారు. అలాగే 7588888824 ఫోన్ నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా రీఫిల్‌ను బుకింగ్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. పేటీఎం, అమెజాన్‌, గూగుల్ పే ద్వారా బుకింగ్, చెల్లింపులు చేసుకోవ‌చ్చని వివరించారు. వీటికి సంబంధించి ఇత‌ర వివ‌రాలు https://cx.indianoil.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని వివ‌రాలు తెలుసుకోవ‌చ్చని వెల్ల‌డించారు. ఈ స‌మావేశంలో ఐవోసి కృష్ణాజిల్లా సేల్స్ మేనేజ‌ర్ జి.వి.వి.ముక్తేశ్వర‌రావు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూట‌ర్ కృష్ణా జిల్లా అధ్యక్షులు కోన శ‌ర‌త్‌, ఆంధ్రప్రదేశ్ ఎల్‌పీజీ డీల‌ర్స్ అసోసియేష‌న్ అధ్యక్షుడు సీహెచ్ శంక‌ర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రైతులకు సంకెళ్లు సిగ్గుచేటు: ఆనందబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.