ETV Bharat / state

AP students in Manipur: మణిపూర్​లో ఏపీ విద్యార్థుల అవస్థలు.. తీసుకురావాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు

author img

By

Published : May 7, 2023, 4:07 PM IST

AP students in Manipur: మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఇంఫాల్ నగరంలోని నిట్ క్యాంపస్​లో ఉన్న ఏపీ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఐదు రోజులుగా తాగునీరు సరిగా లేక, ఒక్క పూట భోజనంతో సరిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తమ కోసం విమానం ఏర్పాటు చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. విద్యార్థుల భద్రతపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది.

Ap Students in Manipur state
Ap Students in Manipur state

AP students in Manipur : మణిపూర్‌లో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యాన ఇంఫాల్ నిట్ క్యాంపస్​లో ఉన్నటువంటి ఏపీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంఫాల్‌ నిట్​లో 150 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారు. కొద్ది రోజులుగా తాగునీరు సరిగా అందడం లేదని, అధికారులు ఒకపూట మాత్రమే భోజనం అందిస్తుడంటంతో ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు వాపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ వసతి గృహాల్లో తలదాచుకున్న విద్యార్థులు.. తల్లిదండ్రులతోనూ మాట్లాడే అవకాశం లేకుండా పోలీసులు జామర్లు పెట్టారు. మరోవైపు మణిపూర్ ప్రభుత్వం తమ సొంత రాష్ట్ర విద్యార్థులను వారి వారి ఇళ్లకు చేర్చగా.. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యాన విద్యార్థుల భద్రతపై వారి తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి విద్యార్థులను తీసుకురానుండగా.. ఏపీ ప్రభుత్వం కూడా తమను త్వరగా స్వస్థలాలకు చేర్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏపీ నుంచి 70మంది.. ఇంఫాల్​లోని నిట్ క్యాంపస్‌లో రాష్ట్ర విద్యార్థులు 70 మంది వరకు ఉన్నారు. క్యాంపస్ చుట్టూ ఆర్మీ బలగాలు మోహరించి రక్షణ కల్పిస్తుండగా.. ఐదు రోజులుగా తాగునీటి కొరత, రాత్రివేళ పేలుళ్ల శబ్దాలతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని విద్యార్థులు కోరారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెల్ప్​లైన్​కు ఫోన్​ చేసినా స్పందన కరవు.. మణిపుర్‌ నుంచి బయటపడాలన్నా విమానాలు లేవని విద్యార్థులు తెలిపారు. తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేశాయని, ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి భరోసా లభించలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. రాత్రివేళ బాంబు పేలుళ్లు జరుగుతున్నాయని అశ్విని అనే విద్యార్థిని అక్కడి పరిస్థితులను వెల్లడించింది. ఎన్‌ఐటీలో 150 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉన్నారని, హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్‌ చేసినా సరైన స్పందన లేదని తెలిపింది. ఇక్కడి నుంచి బయటపడాలన్నా విమానాలు లేవని, మూడు రోజులుగా తాగునీటికి ఇబ్బందిగా ఉందని యజ్ఞశ్రీ అనే మరో విద్యార్థిని తెలిపింది. ఆహార పానీయాలకు ఇబ్బందిగా ఉంది.. మూడు రోజులుగా తరచూ పేలుళ్లు జరుగుతున్నాయని చెప్పింది. యజ్ఞశ్రీ.. అనంతపురం నగరంలోని రుద్రంపేట బైపాస్ ప్రాంతానికి చెందిన గుర్రం ప్రతాప్ చౌదరి కుమార్తె.

తల్లిదండ్రుల ఆందోళన.. విద్యార్థుల తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉందని ఓ విద్యార్థి తండ్రి తెలిపారు. 144 సెక్షన్‌ పెట్టడంతో బయటకు వెళ్లే పరిస్థితి లేదని, ఒకేపూట భోజనం పెడుతున్నారని చెప్పారు. నిట్ విద్యార్థులకు సౌకర్యాలు సరిగా లేవవి ఓ విద్యార్థి తండ్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేయట్లేదని, నిల్వ ఉన్న ఆహారం, తాగునీరు సర్దుబాటు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. విద్యార్థుల తరలింపుపై అధికారులను సంప్రదిస్తే సరిగా చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సహా మిగతా రాష్ట్రాలు వేగంగా స్పందిస్తున్నా.. ఏపీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని వాపోయాడు.

టీడీపీ ఆందోళన.. మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల భద్రతపై తెలుగు దేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులను ప్రభుత్వం క్షేమంగా తీసుకురావాలని, తెలుగు విద్యార్థుల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంఫాల్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల‌ను ప్రభుత్వం ర‌క్షించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ డిమాండ్ చేశారు. వ‌ర్సిటీలో విద్యార్థులు భ‌యంగా గ‌డుపుతున్నారని, సీఎం చొర‌వ తీసుకుని తక్షణమే ప్రత్యేక‌ విమానంలో విద్యార్థులను తీసుకురావాలని అన్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. మణిపూర్‌లో తెలుగు విద్యార్థులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడటంపై లేదని మండిపడ్డారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వారి సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా?.. ఒక్క విమానం ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని అచ్చెన్నాయుడు విమర్శించారు.

మణిపూర్ ప్రభుత్వంతో చర్చలు.. మణిపూర్​లో తెలుగు విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం అత్యవసర హెల్ప్ లైన్​ ఏర్పాటు చేసింది. దిల్లీలోని ఏపీ భవన్ ద్వారా ఇంఫాల్​లో చిక్కుకున్న వారిని సహాయం అందిస్తామని ప్రకటించింది. 011-23384016, 011-23387089 హెల్ప్ లైన్​లు ఏర్పాటు చేశామని, సహాయం కోసం అక్కడి ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడుతున్నట్టు అధికారులు తెలిపారు.

ముమ్మర ప్రయత్నాలు.. మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు దాదాపు 100 మంది ఏపీ విద్యార్ధులు మణిపూర్‌లో చదువుతున్నట్టు గుర్తించామని, వీరిని ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ అధికారులతో మాట్లాడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్ధులను తరలించడానికి పౌరవిమానయానశాఖ అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయానశాఖ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.