ETV Bharat / state

Huge funds for Jagan's government : జగన్ సర్కారుకు కేంద్రం భారీ ఆర్థిక సాయం.. ఎన్నికల ముంగిట బహుమానం

Huge funds for Jagan's government : అప్పుల ఊబిలో కూరుకుపోయి రోజు గడవడమే కష్టంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం ఆపన్న హస్తం అందించింది. ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతున్న ప్రభుత్వానికి వేల కోట్ల బహుమతి అందించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూలోటు 10,461 కోట్లు... ప్రత్యేక సాధారణ ఆర్ధిక సాయం మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలు ఇచ్చింది.

ఏపీకి కేంద్రం భారీగా ఆర్థిక సాయం
ఏపీకి కేంద్రం భారీగా ఆర్థిక సాయం
author img

By

Published : May 23, 2023, 10:35 AM IST

Updated : May 23, 2023, 10:49 AM IST

Huge funds for Jagan's government : ఎన్నికల ఏడాదిలో జగన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమానమే ఇచ్చింది. 2014-15 రెవెన్యూ లోటు కింద ప్రత్యేక ఆర్థిక సాయంగా 10వేల 461కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఈనెల 19న ఆదేశాలు ఇచ్చింది. 2014-15 నుంచి 2018-19 వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రెవెన్యూ లోటు నిధుల కోసం ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ప్రధానిని కలిసి విన్నవించినా ఫలితం కనిపించలేదు. ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్లు కేంద్రం వ్యవహరించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఈ నిధుల విషయమై ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు.. ప్రధాని కార్యాలయం ఆమోదంతో నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం నుంచి ఏపీకి ఏదైనా నిధులిచ్చినా విడతల వారీగా అందేవి. కాగా, ఒకే దఫా ఇంత పెద్దమొత్తంలో నిధులివ్వడమనేది మునుపెన్నడూ లేదు. అదీ ఎన్నికల ఏడాదిలో రావడం విశేషం.

అప్పటి ప్రభుత్వం విన్నవించినా.. రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటు నిమిత్తం అందాల్సిన నిధుల కోసం అప్పటి ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విన్నవించింది. అయినా కొంత మొత్తాన్ని విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. మిగిలిన సొమ్ముకు పలు సాకులు చూపింది. 2014-15 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు, వనరుల భర్తీపై అప్పటి ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తేదీ నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే మధ్య కాలంలో 2014-15 సంవత్సర వనరుల అంతరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో పరిహారం చెల్లించాల్సి ఉంది. దీని ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూలోటు 16వేల78కోట్ల రూపాయలుగా తేల్చారు.

అందులో భాగంగా కేంద్రం 2014-15లో 2వేల 303 కోట్ల రూపాయలు, 2015-16లో 500 కోట్లు, 2016-17లో 11వందల 76కోట్ల 50లక్షలు కలిపి మొత్తం 3వేల979కోట్ల 50 లక్షల రూపాయలు ఇచ్చింది. మిగిలిన మొత్తం విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పింది. అయితే ఇంకా 139కోట్ల 39లక్షల రూపాయలు మాత్రమే విడుదల చేయాల్సి ఉందని, మిగిలినదంతా కొత్త పథకాల కోసం ఖర్చు చేశారని 2017 మే నెలలో అప్పటి ఆర్థిక మంత్రి తెలిపారు. 2018 లోనూ కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో రాష్ట్ర అధికారుల బృందం చర్చలు జరిపింది. కాగ్ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూ లోటును.. 16వేల 78కోట్ల 76లక్షల రూపాయలుగా పరిగణించాలని కోరింది. 2014-15 నాటికి చెల్లించని బిల్లులు పెద్దమొత్తంలో ఉన్నాయని వివరించింది. అయినా కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.

ఇప్పుడు వివరాలు అడిగిమరీ.. గత కొన్నేళ్లుగా రెవెన్యూ లోటు నిధులు భర్తీ విషయమై కేంద్ర, రాష్ట్రాల మధ్య వాదనలు జరుగుతున్నాయి. లోటు మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదని రాష్ట్రం వాదిస్తోంది. పలు దఫాలు వినతి పత్రాలు కూడా అందించింది. అయినా దీనిపై ఏనాడూ పెదవి విప్పని కేంద్రం ఈ ఏడాది మార్చి నెలలో మాత్రం రాష్ట్ర అధికారుల నుంచి వివరాలు అడిగింది. 2014-15, అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి ఏ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి... వాటిలో ఏ బిల్లులు ఎంత చెల్లించలేదో మొత్తం సమాచారాన్ని రికార్డుల ఆధారంగా పంపాలని సూచించింది. ఆ మేరకు కేంద్రం తాజాగా 10,461కోట్ల రూపాయలు ఇచ్చింది.

ఇవీ చదవండి :

Last Updated : May 23, 2023, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.