ETV Bharat / state

విభిన్న రంగాల్లో రాణిస్తున్న విజయవాడ కుర్రాడు - Rural news in vijayawada

కొత్త సవాళ్లను స్వాగతించాలి... వాటిని అధిగమించేందుకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. అవరోధాలు ఎదురైనా పట్టుదల వీడకుండా ప్రయత్నించి ముందడుగు వేయాలి. అప్పుడే గెలుపు దరి చేరుతుంది... విజేతగా నిలబెడుతుంది.. ఇదే విషయం నిరూపిస్తున్నాడు.. విజయవాడ కుర్రాడు ఇమ్మానియల్. పేదరికంతో సావాసం చేస్తూనే విభిన్న రంగాల్లో రాణిస్తూ అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

విభిన్న రంగాల్లో రాణిస్తున్న విజయవాడ కుర్రాడు

author img

By

Published : Apr 10, 2021, 9:44 PM IST

విభిన్న రంగాల్లో రాణిస్తున్న విజయవాడ కుర్రాడు

ఆసక్తికరమైన విభిన్న కళల్లో ప్రతిభ చూపుతున్నాడు విజయవాడకు చెందిన ఇమ్మానియల్‌. అభిరుచి, ఆసక్తే పెట్టుబడిగా...విభిన్న రంగాల్లో రాణిస్తున్నాడు. చిత్రకళ మెుదలు క్రాఫ్టింగ్‌, క్లే ఆర్ట్‌, మైమ్, మోడలింగ్ వంటి వైవిధ్య కళల్లో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నాడు. పెయింటింగ్‌, రంగోలి చిత్రాల్ని అద్భుతంగా వేస్తున్నాడు.

ఇమ్మానియల్‌ స్వస్థలం విజయవాడ రాణిగారితోట. తండ్రి రోజు కూలీ. తల్లి ఇంటి దగ్గరే చిన్నకొట్టు చూసుకుంటుంది. అద్దె ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు. పేదరికంతో అవస్థలు పడుతున్నా.. ఇమ్మానియల్‌ చదువు, విభిన్న కళల్లో చక్కని ఏకాగ్రత చూపుతున్నాడు. కొత్త విషయాల్లో నేర్చుకోవటంలో ఆసక్తే అతడిని ఆల్‌రౌండర్‌గా నిలిపింది.

చిన్నతనం నుంచే తన భావాల్ని అందమైన రంగుల బొమ్మల్లో పలికించేవాడు ఇమ్మానియల్‌. ఆ సృజనే మట్టి బొమ్మల తయారీ వైపు అడుగులు వేసేలా చేసింది. క్లే ఆర్ట్‌పై పట్టు సాధించేలా చేసింది. కళాశాల నుంచి యూనివర్శిటీ స్థాయిలో పలు బహుమతులు అందుకునే స్థాయికి చేర్చింది.

కళలన్నింటికీ మూలం... మైమ్‌. అరుదైన ఆ కళలో ఇమ్మానియల్‌ చక్కని హావభావాలు పలికిస్తున్నాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పారాలింపిక్స్‌పై నాటకం ప్రదర్శించి...ప్రథమ స్థానంలో నిలిచాడు. కళాభిమానుల చేత ఔరా అనిపించుకున్నాడు.

ఇమ్మానియల్‌ డిగ్రీ రెండో ఏడాదిలో ఉండగా.. అమరావతి డిజైనర్‌ వీక్‌ ఫ్యాషన్ పోటీల్లో పాల్గొన్నాడు. వంద మంది ప్రతిభావంతులతో పోటీపడి... ద్వితీయ స్థానం దక్కించుకున్నాడు . రేడియో మిర్చి నిర్వహించిన మిస్టర్‌ విజయవాడ 'క్యాంపస్‌ రాక్‌ స్టార్'‌ పోటీల్లో ప్రథమస్థానం కైవసం చేసుకున్నాడు.

అంతరించిపోతున్న కళలను భావితరాలకు చేరువ చేసే లక్ష్యంతో.... మిత్రులతో కలిసి ఇమాజినరీ క్రియేషన్స్‌ అనే సంస్థ ప్రారంభించాడు ఇమ్మానియల్‌. చదువులోనే కాక విభిన్న కళల్లో సత్తా చాటుతున్న తనను చూసి తల్లిదండ్రులూ గర్వపడేలా చేస్తున్నాడు.

ఇన్నిరంగాల్లో ఎలా నైపుణ్యాలు సాధించావంటే.. నేర్చుకోవాలనే ఆసక్తి, సాధించగలం అనే నమ్మకం ఉంటే.. ఏదైనా సాధ్యమేనంటున్నాడు మట్టిలో మాణిక్యంగా గుర్తింపు తెచ్చుకున్న ఇమ్మానియల్‌.

ఇవీ చదవండి

గొంతుతో రకరకాల బీట్లు.. వింటే ఔరా అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.