ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థానంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టింది. దీనిని నిరసిస్తూ...దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. కౌన్సిల్ బిల్లుని నిలుపుదల చేయాలంటూ, విజయవాడలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిల్లు ప్రతులను వైద్యులు దగ్ధం చేసారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల కౌన్సిల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పోయి, నామినేటెడ్ విధానం వల్ల... వైద్యరంగంతోపాటు, వైద్య విద్యారంగాలు కూడా దెబ్బతింటాయని విజయవాడ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ కార్యదర్శి డా. మనోజ్, అధ్యక్షుడు డా. రమణమూర్తిలు ఆవేదన వ్యక్తం చేశారు.
మెడికల్ సీట్లలో 50 శాతం ప్రైవేట్ సంస్థల వారికి ఇవ్వడం వల్ల సామాన్యుల పిల్లలు వైద్యులు కాలేరని....ఈ విధానం వల్ల మెడికల్ కౌన్సిల్లో వైద్యులకు ప్రాధాన్యత తగ్గి, వైద్యేతర రంగాలవారికి ఇందులో ప్రాధాన్యత పెరగటం వల్ల వైద్య రంగం కుంటుపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు.
ఇది చూడండి: మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే: జగన్