కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు 15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నందిగామ శివారు అనాసాగరం వద్ద జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్తున్న ఓ లారీలో బియ్యాన్ని గుర్తించారు. రకరకాల సంచుల్లో ఉన్న 15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. లారీని సీజ్ చేసి.. ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.
ఇదీ చదవండి: