ETV Bharat / state

Anandaiah Medicine: ఆనందయ్య మందు అమ్ముకునేందుకు కాకాణి కుట్ర: సోమిరెడ్డి - ఎమ్మెల్యే కాకాణిపై ఏలూరి సాంబశివరావు ఆగ్రహం

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి భారీ కుట్రకు తెరలేపారని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ఆనందయ్య ఔషధంతో కాసుల వర్షం కురిపించుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆనందయ్య ఔషధం పేరుతో సెశ్రిత కంపెనీ వెబ్‌సైట్​ సైతం తయారు చేసిందని.. ఈ సంస్థ వైకాపాకు అత్యంత సన్నిహితమైందని సోమిరెడ్డి ఆరోపించారు.

anandayya medicine
anandayya medicine
author img

By

Published : Jun 5, 2021, 4:32 PM IST

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్​రెడ్డి(kakani govardhan reddy) భారీ కుట్ర పన్నారని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి(somireddy chandramohan reddy) భగ్గుమన్నారు. ఆనందయ్య ఔషధం(anandaiah medicine)తో వ్యాపారానికి కాకాణి కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఆనందయ్య మందు పేరుతో సెశ్రిత కంపెనీ వెబ్‌సైట్​ సైతం తయారు చేసిందని.. ఇది అధికార పార్టీకి అత్యంత సన్నితమైందని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెశ్రిత నిర్వహకులు అధికార పార్టీకి సన్నిహితులే..

సెశ్రిత నిర్వాహకులు కాకాణికి, వైకాపాకు అత్యంత సన్నిహితులని పేర్కొన్న సోమిరెడ్డి.. నకిలీ మద్యం తరహాలోనే నకిలీ వెబ్‌సైట్ రూపకల్పన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔషధం ఒక్కో ప్యాకెట్​ను రూ.167కి అమ్ముకునేందుకు పన్నాగం పన్నారని దుయ్యబట్టారు. ఆనందయ్య కుటుంబం ప్రశ్నించడంతో వెబ్‌సైట్‌ను పక్కన పెట్టారని వివరించారు.

సుమోటోగా కేసు పెట్టాల్సిందే..

ప్రభుత్వం వెంటనే స్పందించి కుట్రపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వెబ్‌సైట్‌ సూత్రధారులు, పాత్రధారుల గుట్టు విప్పి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కేసు నమోదు చేయకపోతే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తామని సర్కార్​ను హెచ్చరించారు.

సర్కారే అనుమతిచ్చి అడ్డంకులు సృష్టిస్తోంది : ఏలూరి సాంబశివరావు

ఆనందయ్య ఔషధ పంపిణీకి అనుమతులిచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కార్, మందు తయారీకి మాత్రం అడ్డంకులు సృష్టిస్తోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మందు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆనందయ్య వైద్యాన్ని వైకాపా నేతలు రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు.

అది దుర్మార్గపు చర్య..

ఆస్తులు అమ్ముకుని మరీ ఆనందయ్య తయారు చేస్తున్న వైద్యాన్ని ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునేందుకు యత్నించటం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. రాత్రిపూట మాత్రమే మందు తయారీకి ఆదేశాలిచ్చి విద్యుత్ కోతలు విధించటం వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు.

144 సెక్షన్ పేరిట ఇబ్బందులు..

మెడికల్ మాఫియా కమీషన్ల కోసమే ఆనందయ్యను భద్రత పేరుతో తిప్పలు పెట్టారన్న ఏలూరి.. ప్రజల ప్రాణాలు కాపాడకుండా కార్పొరేట్ వ్యవస్థల నుంచి కమీషన్లు దండుకోవడం కోసమే ప్రభుత్వమే పనిచేయడం ఏమిటని ప్రశ్నించారు. వైద్యం కోసం వచ్చిన వారిని 144 సెక్షన్ పేరుతో ఇబ్బంది పెట్టడంతో పాటు ఆనందయ్యను అనేక విధాలుగా వేధింపులు, బెదిరింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి : కరోనా రోగులకు ప్రవాసాంధ్రుల సాయం..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.