తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో గత రెండు రోజుల నుంచి బోరు మోటారు నుంచి వేడి నీరు వస్తోంది. వాస్తవంగా 2013లో నీటి కోసం ఇంటి యజమాని బోరు మోటారు వేయించాడు. గత నాలుగు రోజుల కిందట మోటారు పాడవడం వల్ల మరమ్మతులు చేయించాడు. రెండు రోజుల నుంచి 38.4 సెటీగ్రేడ్ వేడిమితో నీరు ఉబికి వస్తోంది.
ఈ విషయాన్ని భూగర్భజల శాఖ అధికారిని ఏడీ రమాదేవికి సమాచారం అందించారు. నీటిని పరిశీలించిన ఆమె వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. బోర్ నుంచి వచ్చిన నీటిని పరీక్షించి అన్ని విషయాలు తెలియజేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: వర్సిటీల సవరణ చట్టంపై యూజీసీ, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు