విజయవాడ నగరవాసులకు తక్కువ ఖర్చులో హోమియో వైద్యం అందించేందుకు మొబైల్ వైద్యశాలను ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ప్రారంభించారు. కొవిడ్ సమయంలో మొబైల్ ద్వారా ప్రజలకు వైద్యం అందించటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. విజయవాడ చుట్టుపక్కల గ్రామాలకు సైతం ఈ మొబైల్ వ్యాన్ ద్వారా వైద్య సహాయం అందిస్తామని ఆయన వెల్లడించారు. దేశంలో చాలా ఏళ్ల నుంచి హోమియో వైద్యం అమలులో ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరోసారి కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్