మహిళలపై నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకే దిశ చట్టాన్ని తెచ్చి అమలు చేస్తున్నట్లు హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గతంతో పోల్చితే దిశ చట్టం తెచ్చాక మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయని అన్నారు. నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని తెలిపారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదన్నారు.
మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను గుర్తించే స్థితిలో చంద్రబాబు లేరని ఇళ్లపట్టాల పంపిణీ.. ఆంగ్లమాద్యమం అమలు, ఎస్ఈసీగా దళిత వర్గానికి చెందిన న్యాయమూర్తి నియామకం లాంటి.. మంచి కార్యక్రమాన్నీ అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శిచారు. ఇప్పటివరకు 5.80 లక్షల మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని.. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఆ ఐదు జిల్లాల్లో కరోనా విజృంభణ... రికార్డు స్థాయిలో కేసులు నమోదు