మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఈనెల 20కి వాయిదా వేశారు. వివిధ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ, సీబీఐ, తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తదితరులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తన భర్త వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా, అయిదుసార్లు వినతులు సమర్పించినా ఇప్పటివరకూ స్పందించలేదన్నారు. పది నెలల కావస్తున్న హత్యకు కారకులైన వారిని గుర్తించలేకపోయారని వైఎస్ సౌభాగ్యమ్మ హైకోర్టుకు నివేదించారు.
ఇదీ చూడండి: సింగిల్ జడ్జి ముందుకు వైఎస్ వివేకా హత్య కేసు వ్యాజ్యాలు