ETV Bharat / state

'అభివృద్ధి పేరుతో చెరువులు నాశనం చేస్తారా?'

author img

By

Published : Feb 20, 2020, 5:31 AM IST

ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో చెరువుని నాశనం చేశారంటూ శ్రీకాకుళం జిల్లా అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు ఆపేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ... విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

High Court hearing on destroy the pond
చెరువును ధ్వంసం చేయడంపై హైకోర్టు ఆగ్రహం

ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో చెరువుని నాశనం చేశారంటూ శ్రీకాకుళం జిల్లా అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధి పేరు చెప్పి ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. జేసీబీ యంత్రాలతో చెరువును పూడ్చడం ఏమిటని నిలదీసింది. తదుపరి చర్యలను నిలిపేయాలని తేల్చిచెప్పింది. చెరువుకు సంబంధించిన 3.06 ఎకరాల భూమిలో ఎవరికి పట్టాలు ఇవ్వొద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ... విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. నవరత్నాల పథకంలో భాగంగా ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ కోసం శ్రీకాకుళం జిల్లా అల్లినగరం గ్రామంలోని చెరువుకు సంబంధించిన 3.06 ఎకరాల భూమిని జేసీబీలతో పూడ్చి చదును చేస్తున్నారంటూ ఎల్.సూర్యనారాయణ మరొకరు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఫోటోలను పరిశీలించిన ధర్మాసనం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఇదీచూడండి.విజయవాడలో పైప్​లైన్​ పనులకు మంత్రుల శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.