ETV Bharat / state

విజృంభిస్తున్న విష జ్వరాలు... వణుకుతున్న ప్రజలు

author img

By

Published : Sep 22, 2019, 6:51 AM IST

విష జ్వరాలతో గుంటూరు, కృష్ణా జిల్లాలు వణుకుతున్నాయి. జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసి దర్శనమిస్తున్నాయి. జ్వరాలు నియంత్రించటానికి యంత్రాంగం చర్యలు చేపడుతున్నా, విషజ్వరాలు అదుపులోకి రాక అధికారులకు సవాలుగా నిలిస్తున్నాయి.

విజృంభిస్తున్న విష జ్వరాలు
విజృంభిస్తున్న విష జ్వరాలు

వైరల్​ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలి గుంటూరు, కృష్ణా జిల్లా వాసుల్ని భయపెడుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 109 డెంగీ ,104 మలేరియా కేసులు నమోదు అయ్యి గుంటూరు మెుదటి మూడు స్థానాల్లో నమోదు కావటంతో జిల్లా యంత్రాంగం కలవరపడుతోంది. ఎక్కడికక్కడే నిలిచిపోయిన మురుగు కాల్వలు, సగంలో తవ్వి వదిలేసిన భూగర్భ డ్రైనేజి పనులతో దోమలు వృద్ధి చెందుతున్నా అధికారులు చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అందువల్లే గ్రామీణ ప్రాంతాల నుంచి కాకుండా, పట్టణ ప్రజలే జ్వరాల బారిన పడుతున్నారు. 12 మెుబైల్ వాహనాల ద్వారా జ్వరాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు గుంటూరు వైద్యశాఖ అధికారి యాస్మిన్ తెలిపారు.
డెంగీ ఉన్నా ఆందోళన వద్దు....

విజయవాడలో చిన్నా, పెద్ద ఆసుపత్రులు అనే తేడా లేకుండా జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. చిన్న జ్వరమెుచ్చినా ప్రజలు భయంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకుంటున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. సకల సౌకర్యాలు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తున్నాయనీ, రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలీసా పరీక్షతోనే డెంగీ జ్వర నిర్థరణ అవుతుందనీ, ఒక వేళ డెంగీ ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వివరిస్తున్నారు.

రోగులను భయపెడితే చర్యలు....

డెంగీ జ్వరాల పేరుతో రోగులను భయపెట్టాలని చూసే ప్రైవేటు ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారులు హెచ్చరించారు. ఎక్కడిపడితే అక్కడ చెత్త వేయకుండా, నిర్దేశించిన చెత్త డబ్బాల్లోనే చెత్తను వేసి పారిశుద్ధ్య నిర్వాహకులకు ప్రజలంతా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : రసాయనాలే గోవుల ప్రాణాలు తీశాయి...

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పు గోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_31_31_viralam_annadanam_p v raju_av_AP10025 అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తురాలు రూ. 1,01,116 విరాళం అందించారు. భీమవరం కు చెందిన సౌమ్య కుమార స్వామి ఈ విరాళం దేవస్థానం అధికారులకు అందించి తమ పేరుమీద అన్నదానం చేయాలని కోరారు. దాత ను అధికారులు అభినందించారు.Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.