కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ద్విచక్రవాహనంపై రూ. 1,78,000 విలువైన గుట్కాను తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అంబారుపేట గ్రామవాసి రాజాగా గుర్తించారు. ఇతనిపై గతంలోనూ కూడా గుట్కా సరఫరా కేసులున్నట్టు డీఎస్పీ రమణమూర్తి చెప్పారు.
నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇతనికి గుట్కాలు సరఫరా చేసే మరో ఇద్దరిపైనా కేసులు నమోదు చేశామన్నారు. వారిని కంచికచర్లకు చెందిన శేఖర్, తెలంగాణకు చెందిన మరో వ్యక్తిగా గుర్తించినట్లుగా తెలిపారు. వారిని కూడా పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: