ETV Bharat / state

ATTRACTIVE CHILDREN HOSPITAL: భలే భలే.. బుజ్జాయిల ఆస్పత్రి

ఈ చిత్రం చూసి ఇదేదో పాఠశాలో.. లేదంటే పార్కు అనుకుంటున్నారా..? అయితే మీరు భ్రమల్లో కాలేసినట్లే..! ఇదో ప్రభుత్వ ఆస్పత్రిలోని పిల్లల వార్ఢు. ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండి! మరి, ఇది ఎక్కడ? ఎమిటి? అనే సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే ఈ కథనం చదివేయండి.

gudivada-area-hospital-childrens-ward-special-story
భలే భలే అనిపిస్తున్న బుజ్జాయిల ఆస్పత్రి
author img

By

Published : Nov 13, 2021, 10:01 AM IST

ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లు 40, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌ మాస్కులు 200, పల్స్‌ ఆక్సీ మీటర్లు 60, ఆక్సిజన్‌ మాస్కులు 200, సర్జికల్‌ గౌన్లు 200, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు 8, మల్టీపారామీటర్లు 12, స్తెతస్కోప్‌లు 8 ఏర్పాటు చేశారు. వాటితో పాటు ప్రతి చిన్నారి రోగికి అందజేసేందుకు హిమాలయ హ్యాండ్‌ శానిటైజర్‌, ఎన్‌-95 మాస్కులు, డెటాల్‌ సబ్బులు, లైజాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ కిట్లు 715 సరఫరా చేశారు. ఈ నెల 8న మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి ఈ వార్డును ప్రారంభించి దాతను అభినందించారు. పిల్లల వైద్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతోపాటు ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా కొత్త సాంకేతిక పరికరాలు అందించడంతో చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి వీలవుతుందని.. దాతల ఆశయాన్ని సద్వినియోగం చేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఇందిరాదేవి వెల్లడించారు.

గోడలపై కామిక్‌ బొమ్మలతో ఆకర్షణీయంగా..
సాధారణంగా ఆస్పత్రికి వెళ్లాలంటే ఎవరైనా జంకుతారు. అక్కడ ఉండే వాతావరణమే దీనికి ప్రధాన కారణం. మందుల వాసన, వైద్య చికిత్సల పోస్టర్లు.. రద్దీగా ఉండే రోగులతో భయం భయంగా ఉంటుంది. అదే పిల్లలకైతే ఆస్పత్రి పేరు చెబితేనే అమ్మో వైద్యులు, నర్సులు, ఇంజక్షన్లు అంటూ మారాం చేస్తారు. కానీ ఆ ఆస్పత్రిలోని పిల్లల వార్డు చూస్తే చిన్నారులు ఎగిరిగంతేస్తారు. ఎందుకంటే అక్కడ కామిక్‌ బొమ్మలు, ఆడుకునేందుకు ఆట వస్తువులతో ఒక కొత్త లోకంలోకి అడుగు పెట్టినట్లు ఆస్వాదిస్తారు. దాత సహకారంతో లక్షలు వెచ్చించి అందంగా తీర్చిదిద్దడంతో పిల్లల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అదే గుడివాడ ఏరియా ఆస్పత్రిలోని పిల్లల వార్డు.

రెండు వైపులా బొమ్మలతో పిల్లల వార్డు ఇలా..

డివిజన్‌లోని 9 మండలాలకు చెందిన రోగులకు స్థానిక ఏరియా ఆస్పత్రి పెద్ద దిక్కు. ఇక్కడ ప్రత్యేకంగా పిల్లల కోసం వార్డు ఉంది. నిత్యం 60-70 మంది చిన్నారులు ఇక్కడ ఇన్‌, అవుట్‌ పేషెంట్లుగా చికిత్స పొందుతారు. 30 పడకలకు సేవలందించేందుకు వైద్య సిబ్బంది ఉన్నారు. సాధారణ వార్డుల వలే అన్ని సదుపాయాలున్నాయి. దిల్లీ కేంద్రంగా పని చేసే ప్రాజెక్ట్‌ హోప్‌ - చైల్డ్‌ ఫండ్‌ సంస్థ దేశవ్యాప్తంగా పిల్లల ఆస్పత్రుల అభివృద్ధికి నడుం బిగించింది. రే అనే మహానుభావుడు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రుల్లో ఆహ్లాదకర వాతావరణంతో పిల్లల్ని అనారోగ్యం నుంచి ఉపశమని కలిగించి వారికి స్వస్థత కలిగించవచ్చని సంస్థ భావించింది. ఆస్పత్రి వాతావరణం కనిపించకుండా పాఠశాల ప్రాంగణం, పార్కులా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో ₹ 25 లక్షలతో గుడివాడ పిల్లల వార్డును ఆధునికీకరించాలని సంకల్పించింది. అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతోపాటు వార్డును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. వార్డు ప్రారంభం నుంచి గోడలకు రెండు వైపులా కామిక్‌ బొమ్మలతో తీర్చిదిద్దారు. అలాగే ఆస్పత్రివార్డులో అన్ని వైపులా గోడలపై పిల్లలకు ఇష్టమైన చోటాభీం, షిన్‌చాన్‌, జంగిల్‌ బుక్‌, మిక్కీ మౌస్‌, టామ్‌ అండ్‌ జెర్రీ తదితర బొమ్మలతో నింపేశారు.

ఆడుకునేందుకు ఆట వస్తువులు

ఇదీ చూడండి: PADAYATRA: అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం.. కారణమేంటంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.