ETV Bharat / state

రాష్ట్రంలో పొగాకు కొనుగోలుకు ప్రత్యేక సంస్థ

పొగాకు రైతుల కష్టాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొగాకు కొనుగోలుకు ఐఏఎస్​ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనుంది. పొగాకు రైతుల సమస్యలపై సమీక్షించిన సీఎం జగన్​.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

రాష్ట్రంలో పొగాకు కొనుగోలుకు ప్రత్యేక సంస్థ
రాష్ట్రంలో పొగాకు కొనుగోలుకు ప్రత్యేక సంస్థ
author img

By

Published : Jun 18, 2020, 7:37 PM IST

Updated : Jun 19, 2020, 3:55 AM IST

పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి జగన్​ తెలిపారు. పొగాకు కొనుగోలు చేసేందుకు ఐఏఎస్​ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కొనుగోలుకు వీలుగా ఈ సంస్థ లైసెన్స్​ తీసుకుంటుందని.. పొగాకు బోర్డు కంపెనీలు, వ్యాపారులతో కలిసి ముందుకెళ్తుందని చెప్పారు. పొగాకుకు కనీస ధరలు ప్రకటించి.. ఆ ధర కన్నా ఎక్కువకు కొనుగోలు చేసేలా చూస్తుందన్నారు. త్వరలో సంస్థను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అప్పటి వరకూ మార్క్​ఫెడ్​ ద్వారా కొనుగోళ్లు జరపాలని కోరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పొగాకు రైతుల సమస్యలపై సీఎం జగన్​.. గురువారం సమీక్ష నిర్వహించారు. ఇచ్చిన లక్ష్యం మేరకు పంటలు పండించినా.. వ్యాపారులు వేలం కేంద్రాల వైపు చూడడం లేదని రైతులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆర్డర్లు ఉన్నా.. గడువు ముగిసినా కొనుగోలుకు ముందుకు రావడం లేదని తెలిపారు.

లక్ష్యాల మేరకు సాగు చేస్తున్నప్పుడు కొనుగోలు చేయకపోతే రైతులు నష్టపోతారని సీఎం.. వ్యాఖ్యానించారు. '920 మందికి లైసెన్సులు ఇస్తే 15 మందికి మించి వేలంలో పాల్గొనడం లేదు. వ్యాపారులు కుమ్మక్కవుతున్నారని రైతులు చెబుతున్నారు. నాణ్యమైనది మాత్రమే తీసుకుని మిగతాది కొనుగోలు చేయకుండా వదిలేస్తున్నారని పేర్కొంటున్నారు. దీనికి పరిష్కారం చూపాల్సి ఉంది. సరకు వేలం కేంద్రానికి వచ్చిన రోజే కొనుగోలు చేస్తేనే బాగుంటుంది. రైతులను తిప్పి పంపే పరిస్థితి ఉండకూడదు'... అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

రెండు రోజుల్లో కనీస ధర

పొగాకుకు గ్రేడ్ల వారీగా రెండు రోజుల్లో కనీస ధరలు ప్రకటించాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఈ ధరలను ప్రదర్శించాలని.. వీటి ఆధారంగానే వేలం నిర్వహించాలని సూచించారు. వ్యాపారాలు చేయని వారి లైసెన్సులు తొలగించాలని అన్నారు.

ఇదీ చదవండి ..

వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు

Last Updated : Jun 19, 2020, 3:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.