రాజధానిపై మంత్రుల వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఉద్యోగాలు,రాజధాని అంశాల్లో తీవ్ర గందరగోళం నెలకొని ఉందని తెలిపారు. మంత్రి బొత్స వ్యాఖ్యల వలన రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయిందని, అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని అన్నారు. వాస్తవాలను తెలియజేసే మీడియా చానెళ్లను నిలిపివేయడం అప్రజాస్వామికమని,మీడియాపై ప్రభుత్వ ఆంక్షలు ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టువంటిదని రామకృష్ణ అన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ సరిహద్దులో చంద్రబాబు వాహనం.. అసలేం జరిగింది!