ఇదీ చూడండి.
అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - అంతర్వేది రథం దగ్ధం కేసు
అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
అంతర్వేది రథం దగ్ధం ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్ధమైన ఘటనను సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబరు 5 తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారని.. దీనిని సీబీఐకి బదలాయిస్తున్నట్టు తెలిపింది. ఈ కేసును బదిలీ చేసిన అనంతరం ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వం సీబీఐని కోరింది.
ఇదీ చూడండి.