ETV Bharat / state

'రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ ప్రాంతాల ప్రకటనకు స్వస్తి'

author img

By

Published : May 21, 2020, 12:06 AM IST

Updated : May 21, 2020, 12:28 AM IST

కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు ప్రాంతం ఆధారంగా కట్టడి ప్రాంతాన్ని గుర్తించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కేసు నమోదైన ఇంటి నుంచి నుంచి 200 మీటర్ల దూరం వరకు కట్టడి ప్రాంతంగా ప్రకటించాలని తెలిపింది . కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి లాక్​డౌన్ వెసులుబాటులో భాగంగా కేసుల నమోదు అనుసరించి.. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ ప్రాంతాలుగా ప్రకటించే విధానానికి స్వస్తి పలికింది. కేసుల నమోదు ప్రాంతం ప్రతిపాదికన ప్రకటించిన కట్టడి ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది . దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది .

government   issued orders   on corana positive virus
ఏపీలో కరోనా పాజిటివ్

కేసు నమోదైన ఇంటి నుంచి నుంచి 200 మీటర్ల దూరం వరకు కట్టడి ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వం తెలిపింది. అక్కడ నుంచి అదనంగా మరో 200 మీటర్ల దూరాన్ని బఫర్ జోన్ కింద గుర్తించాలని సూచించింది. భౌగోళికంగా హద్దులను ప్రకటించి తదుపరి చర్యలు తీసుకోవాలని... ఒకేచోట పది కేసులు నమోదైతే అక్కడి నుంచి 500 మీటర్ల దూరం వరకు కట్టడి ప్రాంతంగా గుర్తించాలని పేర్కొంది. ఇక్కడి నుంచి మరో 500 మీటర్ల దూరాన్ని బఫర్ జోన్ కింద గుర్తిస్తున్నట్లు ప్రకటించాలని తెలిపింది. గడిచిన 5 రోజుల్లో కొత్త కేసుల నమోదైతే ఆ ప్రాంతాన్ని వెరీ యాక్టివ్ అని... 6 నుంచి 14 రోజులైతే యాక్టివ్​గా... ,కేసుల నమోదు జరిగి 15 నుంచి 28 రోజుల మధ్యన ఉంటే దానిని తీవ్రత లేని ప్రాంతంగా గుర్తించాలని చెప్పింది. పట్టణాల్లో కేసుల నమోదైన ప్రాంతం దగ్గర వీధులు, రెసిడెన్షియల్ కాలనీలు, మున్సిపల్ వార్డులు పక్కపక్కనే ఉంటే వాటిని కూడా కలిపి కట్టడి ప్రాంతాలుగా ప్రకటించాలని...కేసుల నమోదైన గ్రామాలు పక్కపక్కనే ఉంటే వాటిని కూడా కలిపి కట్టడి ప్రాంతాలుగా వెల్లడించాలని పేర్కొంది. కరోనా వ్యాప్తి ప్రభావాన్ని పరిగణనలోనికి తీసుకుని ఈ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

కట్టడి ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలు గుర్తించి బారికేడ్లను ఏర్పాటుచేయాలని... ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారి విషయంలో మినహాయింపు ఇవ్వాలని... పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలియగానే ప్రైమరీ కాంటాక్టును 12 నుంచి 24 గంటల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి గుర్తించిన వారిని ఇంట్లో,ఇతర ప్రదేశంలోనైనా... స్వీయ నిర్భందంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పాజిటివ్ కేసు నమోదు గురించి తెలిసిన వెంటనే చుట్టుపక్కల ఉండే వారికి పరీక్షలు జరపాలని... పరీక్షలు చేయడంలో 60 సంవత్సరాలు పైబడిన వారికి, ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.

'ఆరోగ్యసేతు ' యాప్​ను స్మార్ట్​ ఫోన్ల ద్వారా అందరూ డౌన్​లోడు చేసుకునేలా ప్రోత్సహించాలని.... బఫర్ జోన్ ప్రాంతాల్లోనూ ఇంచుమించు ఈ నిబంధనలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. స్థానికుల రాకపోకలు , నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో వెసులుబాటు కల్పించాలని తెలియజేసింది. ఆరోగ్య కార్యకర్తలను అప్రమత్తం చేసి.. స్థానికుల నుంచి వివరాలు సేకరించాలని పేర్కొంది. కట్టడి ప్రాంతంగా ప్రకటించినప్పుడు అక్కడ జరిగే వాణిజ్య, వ్యవసాయ, పరిశ్రమల కార్యకలాపాలకు విఘాతం కలుగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు 24 గంటల సమయం ఇవ్వాలని తెలిపింది. కేసు నమోదు ఆధారంగా ప్రకటించిన కట్టడి ప్రాంతంలో 28 రోజుల వరకు మరే కేసు నమోదు జరగకుండా ఉంటే.. జిల్లా అధికారులు డీ - నోటిపై చేయాలని తెలిపింది. మాస్కుల ధరించడాన్ని... భౌతిక దూరాన్ని పాటించడాన్ని ప్రోత్సహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీచూడండి. లాక్​డౌన్ మినహాయింపులు.. తెరవాల్సినవి.. తెరవకూడనివి..!

Last Updated : May 21, 2020, 12:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.