ETV Bharat / state

కోయంబేడు ఎఫెక్ట్​: పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరగడానికి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌ ప్రధాన కారణంగా నిలుస్తోంది. అలాగే కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఏపీకి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల వారికి కూడా సోకుతుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అలాగే డిశ్చార్జి కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కొంత ఊరటనిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 2100కాగా...డిశ్చార్జైన వారి సంఖ్య 1192కు చేరింది.

governement released Corona Health Bulletin
ఏపీలో కరోనా కేసులు
author img

By

Published : May 15, 2020, 12:01 AM IST

తమిళనాడులోకి కోయంబేడు మార్కెట్‌ కరోనా పాజిటివ్‌ కేసుల అడ్డాగా మారింది. ఆ మార్కెట్‌ కారణంగా ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో నమోదైన 36 కేసుల్లో 21 కేసులు కోయంబేడు మార్కెట్‌కు వెళ్లివచ్చిన వారే అని ప్రభుత్వం తెలియజేసింది. దీంతోపాటు మరో 32 కేసులు పొరుగు రాష్ట్రానికి చెందిన వారివికూడా నమోదయ్యాయి.

గడచిన 24గంటల్లో నెల్లూరులో 15కేసులు, చిత్తూరులో 9కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక కేసు కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారేనని ప్రభుత్వం తెలిపింది. గుంటూరులో 5, కడపలో 2, కృష్ణాజిల్లాలో 2, శ్రీకాకుళంలో 2 పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. ఇక పొరుగురాష్ట్రాలు మహారాష్ట్రకు చెందిన 29మంది, ఒడిశా 2, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒక్కరికి కరోనా పాజిటివ్‌ సోకినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా ఏపీకి చెందిన 36మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 32మందికి కలిపి 68మందికి కరోనా పాజిటివ్‌ సోకినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గడచిన 24గంటల్లో నమోదైన ఏపీకి చెందిన 36 కేసులతో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2100కు పెరిగింది.

గడచిన 24గంటల్లో 50మంంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జయ్యారు. ఇప్పటివరకూ డిశ్చార్జైన వారి సంఖ్య 1192కు చేరింది. కర్నూలు జిల్లాలో ఒకరు కరోనా కారణంగా మృతి చెందడంతో... మృతుల సంఖ్య 48కి పెరిగింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 860మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇదీచూడండి.

పోతిరెడ్డిపాడుపై కేంద్రమంత్రికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఫోన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.