అమరావతి రైతులతో కలసి అసెంబ్లీ ముట్టడి ర్యాలీలో పాల్గొన్నందుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఆయన అరెస్ట్ ప్రక్రియలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన జయదేవ్‌ను మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ ప్రక్రియలో గల్లా జయదేవ్ చొక్కా చిరిగిపోవటంతో పాటు ఒంటికి గాయాలయ్యాయి. తొలుత జయదేవ్‌ను రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించి కొద్దిసేపు హైడ్రామా నడిపారు. ఆ తరువాత గుంటూరు తరలిస్తున్నామని చెప్పి దాదాపు నాలుగు గంటల పాటు గుంటూరు బైపాస్ రోడ్డులో పోలీసులు తిప్పారు. వివిధ పోలీస్‌స్టేషన్లు తిప్పి సోమవారం అర్ధరాత్రి మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. గల్లా జయదేవ్‌కు బెయిల్ నిరాకరించటంతో పాటు రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్.
తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు గల్లా జయదేవ్‌ను తరలించారు. పోలీసులకు అడుగడుగునా మహిళలు, యువకులు అడ్డుపడ్డారు.
ఇదీ చూడండిదండం పెట్టి అడిగినా కనికరించలేదు'