విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ మహోత్సవం నేటితో ముగియనుంది. పెద్ద సంఖ్యలో భవానీలు దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. అమ్మా బేదెళ్ళినామే అంటూ భవానీలు గిరి ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తున్న భవానీలు స్థానికంగా తగిన వసతి సౌకర్యాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న భక్తుల కోసం ప్రభుత్వం కచ్చితంగా ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వాలకు లేఖలు రాసినప్పటికీ.. వారు చర్యలు తీసుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు.
పెనగంచిప్రోలులో మాల ధారణ కార్యక్రమం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో మండల దీక్ష మాల ధారణ కార్యక్రమం ప్రారంభమైంది. దీక్షలు స్వీకరించేందుకు ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు మర్రిబోయిన వెంకటరమణ ఆధ్వర్యంలో మాల ధారణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో ఆలయ ఛైర్మన్ ఇంజం చెన్నకేశవరావు, ధర్మకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
MLA ROJA AT TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా