ETV Bharat / state

ఫ్యాక్షన్ పాలకుల చేతిలో బందీగా ఎస్సీ చట్టాలు:జవహర్ - vijayawada latest news

వైకాపా నేతల తీరుపై మాజీ మంత్రి, తెదేపా నేత జవహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ పాలకుల చేతిలో ఎస్సీ చట్టాలు బందీ అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన శిరోముండనం ఘటనలపై ఆళ్ల నాని కేసు వేయాలని డిమాండ్ చేశారు.

former minister javahar fire on ycp leaders about sc laws
మాజీ మంత్రి జవహర్
author img

By

Published : Mar 18, 2021, 7:38 PM IST

ఫ్యాక్షన్ పాలకుల చేతిలో ఎస్సీ చట్టాలు బందీ అయ్యాయని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ఎస్సీల హక్కులు దళారుల చేతిలో ఉన్నాయన్నారు. వారిపై వైకాపా నాయకులకు ప్రేమ ఉంటే ఇడుపులపాయలో ఆక్రమణకు గురైన భూములు ఇప్పించాలని జవహర్ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరిగిన శిరోముండనం ఘటనల గురించి మంత్రి ఆళ్ల నాని కేసు దాఖలు చేస్తే... ఆయనకు దళితరత్న బిరుదు ప్రదానం చేస్తామని ఎద్దేవా చేశారు. తెదేపా అధినేత చంద్రబాబుపై కక్షతోనే అట్రాసిటి కేసులు పెట్టి, విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆక్షేపించారు.

ఇదీచదవండి.

ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.. పిల్లలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.