ETV Bharat / state

ఎవరైనా రాకపోతారా..ముంపు బాధితుల నిరీక్షణ! - floods

కృష్ణానదికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతల నుంచి దాదాపు 5 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో...ప్రకాశం బ్యారేజీ నుంచి గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి నీటి విడుదలతో సమీప ప్రాంతాలైన కృష్ణలంక, రాణిగారితోట, తారకరామనగర్, కోటి నగర్, పోలీస్ కాలనీ ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ముంపు దృష్ట్యా మంగళవారమే జిల్లా కలెక్టర్, పలువురు అధికారులు ముందుగానే ఈ ప్రాంత వాసులను ఖాళీ చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాలు సరిపోవడం లేదని, కృష్ణానది కరకట్టపైనే సామాన్లు పెట్టుకుని ఉండాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుంచి విద్యుత్, తాగేందుకు మంచి నీళ్లు సైతం లేకుండా ఎవరైనా రాకపోతారా అంటూ నిరీక్షిస్తున్నామని వాపోతున్నారు. కృష్ణలంక ప్రాంత పరిస్థితిపై మరిన్ని వివరాలు ఈటీవీ-భారత్ ప్రతినిధి వివరిస్తారు.

flood_problems_in_andhrapradesh
author img

By

Published : Aug 14, 2019, 6:32 PM IST

.

ముంపు కష్టాలు...ఎవరైనా రాకపోతారా అంటూ నిరీక్షణ!

.

ముంపు కష్టాలు...ఎవరైనా రాకపోతారా అంటూ నిరీక్షణ!
Intro:బిజెపి రాష్ట్ర అదికార ప్రతిని కామెట్స్Body: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులకు పార్టీ సభ్యత్వం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ యావత్ ప్రపంచం ప్రధానమంత్రి మోడీ వైపే చూస్తోందని దేశ ప్రధాని ఆరు నిమిషాలు దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని భారతదేశ చరిత్రలోనే అత్యధిక సభ్యత్వ నమోదు కాగా పార్టీ బిజెపి అని అలాంటి పార్టీలో సభ్యత్వం తీసుకోవడం నిజంగా అదృష్టంగా భావించాలి అని ఈ సందర్భంగా ఆయన అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కనిపించిన వాళ్ళందరికీ ముద్దులుపెట్టుకుంటూ వెళ్లి అధికారం చేజిక్కి తరువాత రద్దుల ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజలు నచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తే కనబడ్డ పథకాలన్నీ రద్దు చేసుకుంటూ పోతు చివరికి పేదప్రజలకు కడుపు నింపే విధంగా ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసి జగన్ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నాగార్జున రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి. వల్లంపాటి రమణారెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చ కార్యదర్శి సభ్యులు. పెంచలయ్య, మరియు సోమశిల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.