హెచ్చుతగ్గులతో కృష్ణా వరద ప్రవాహం గుబులు రేపుతోంది. వరద తగ్గినట్టే తగ్గి శుక్రవారం సాయంత్రానికి మళ్లీ ఉధృతి పెరగడంతో అధికారులు 2.70 లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజి నుండి దిగువకు విడుదల చేశారు. గురువారం వరద తగ్గుముఖం పట్టిందనుకుంటే, శుక్రవారం సాయంత్రానికి కొత్తగా 4.25 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో, బ్యారేజి నుంచి దిగువకు నీరు వదలని తప్పని పరిస్థితి అని అధికార్లు అంటున్నారు. నాగార్జున సాగర్ గేట్లను ఎత్తడంతోనే వరద నీరు ప్రకాశం బ్యారేజికి వరద నీరు పోటెత్తిందని అధికార్లు చెబుతున్నారు. కృష్ణానది ఉగ్ర రూపం దాల్చడంతో బ్యారేజి దిగువన భయాందోళనలో లంక గ్రామాలు ఉన్నాయి.
ఇదీ చూడండి:
ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు,భయాందోళనలో లంక గ్రామాలు - nagarjuna sagar
పరవళ్లతో చూడముచ్చటగా కనిపించే కృష్ణానది, ఉగ్రరూపం దాల్చితే అంతే భయానక పరిస్థిని కలిగిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి పోటెత్తుతోన్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు ఒక్కసారిగా 2.70 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతో, భయాందోళనలో లంక గ్రామాలు ఉన్నాయి.